కానీ 'పుష్ప-2' విషయంలో మాత్రం బెనిఫిట్ షోల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బన్నీ సినిమాలను మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకునేవాళ్లు. బెనిఫిట్ షోలను చాలా వరకు వాళ్లే తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మెగా అభిమానుల నుంచి బన్నీ అభిమానులు వేరైపోయారు. వారికి కొత్త ఫ్యాన్స్ తోడయ్యారు. బన్నీ తీరు నచ్చక అతణ్ని మెగా ఫ్యాన్స్ బాయ్‌కాట్ చేసే పరిస్థితి వచ్చింది. 'పుష్ప-2' సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేశారు.ఐతే రిలీజ్ టైంకి ఇదంతా పక్కకు వెళ్లి మెగా ఫ్యాన్స్ సినిమాను ఓన్ చేసుకుంటారని భావించారు. కానీ వాళ్లు బాయ్‌కాట్ పిలుపు విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణల్లో ఎక్కడా మెగా ఫ్యాన్స్ బెనిఫిట్ షోలు తీసుకోవద్దని.. చూడొద్దని చాలా బలంగా నిర్ణయించుకున్నారు. దీంతో బన్నీ ఎక్స్‌క్లూజివ్ ఫ్యాన్సే వీటిని డీల్ చేయాల్సి వస్తోంది. వారికి ఈ విషయంలో అనుభవం తక్కువ. మెగా ఫ్యాన్స్ సహకారం లేకుండా వీటిని మేనేజ్ చేయడం అంత తేలిక కాదు. దీంతో ఈ షోలు అనుకున్న సంఖ్యలో పడకపోవచ్చని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి