ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు చేస్తారా..? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పాన్ ఇండియా సినిమాలు చేయరా..? లేదా కావాలనే వాళ్ళు ఆ రేస్ నుంచి తప్పుకున్నారా..? వాళ్ళ ఇమేజ్కు తగిన కథలో రావట్లేదా..? పైన చెప్పుకున్న హీరోలకు ఏమాత్రం తీసిపోని విదంగా చిరంజీవికి మార్కెట్ ఉంది. సినిమా క్లిక్ అయితే కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది. ప్లాప్ అయితే ఆ నష్టాలు లెక్కకు కూడా అందవు.. అది వేరే సంగతి. సీనియర్ హీరోలలో అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో చిరంజీవి మాత్రమే.
అయితే.. చిరంజీవి ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవికి హిట్లు కంటే ఫ్లాప్‌లే ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఆయన హిట్ సినిమాలు ఏవి నార్త్ బెల్టులో క్లిక్ అవ్వడం లేదు. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఇది భారీ బడ్జెట్ సినిమా. ఇక్కడ సమస్య ఖర్చు కాదు .. విశ్వంభర సబ్జెక్టు నార్త్ జనాలకు ఎక్కాలి. అదే జరిగితే.. చిరంజీవి పాన్ ఇండియా కల నెరవేరుతుంది. బాలకృష్ణ ఆల్రెడీ పాన్ ఇండియా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
భగవంత్ కేసరి సినిమాకు స్వయంగా తానే డబ్బింగ్ చెప్పి మరి హిందీలో రిలీజ్ చేశారు. డాకు మహరాజ్ సినిమా కు హిందీ వర్షన్ రిలీజ్ అయింది. ఈ రెండూ అక్కడ క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు బాలయ్య ఆశలు అన్ని అఖండ 2 మీద ఉన్నాయి. ఇక నాగార్జున, వెంకటేష్ అయితే ఈ రేసులో చాలా దూరంగా ఉన్నారు. వెంకటేష్ తన సినిమాలను పూర్తిగా తెలుగు మార్కెట్కే పరిమితం చేశారు. ఇక నాగార్జున రీజనల్ సినిమానే తీయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో నాగార్జున నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశించడం అత్యాశ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి