
అలాగే ఆయన కాలజ్ఞానాన్ని ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా అందరికీ కళ్ళకి కట్టినట్టు చూపించారు .. అలాగే బ్రహ్మంగారి శిష్యుడు సిద్దయ్య పాత్రలో బాలకృష్ణ నటించారు .. ఈ సినిమా క్లైమాక్స్లో బాలకృష్ణ నటన కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక 1980లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది .. 50 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు .. కానీ సెన్సార్ విషయంలో ఈ సినిమాకి అడ్డంకులు వచ్చాయి .. బోగివేమన యోగీల ఎలా మారడానికి సన్నివేశాలు మొదట్లో ఉంటాయి .. అయితే అందులో వేమన వదిన పాత్రను నగ్నంగా చూపిస్తారు .. సన్నివేశంపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారు .. కానీ ఆ సీన్‌ను తొలగించడానికి ఎన్టీఆర్ అసలు ఒప్పుకోలేదు .. దాదాపు నాలుగేళ్లు ఈ వివాదం కోర్టులోనే నడిచింది. అలాగే ఈ సినిమాను మొదలుపెట్టే ముందు ఎన్టీఆర్ ని కొందరు స్నేహితులు కూడా హెచ్చరించారట .
ఈ సినిమాలో నటిస్తే మీకు ఏదో ఒక ఇబ్బంది కీడు జరుగుతుంది గతంలో కూడా చాలామంది వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్ర తెర్కక్కించాలని ప్రయత్నించి తర్వాత విరమించుకున్నారు అని చెప్పారట .. కానీ ఎన్టీఆర్ మాత్రం మొండిగా ముందుకు వెళ్లారు .. చివరికి సినిమా ఎన్టీఆర్ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయింది .. 1983 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగా 84 లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి పదవికి కొంతకాలం దూరంగా ఉన్నారు .. ఆ టైంలో ఎన్టీఆర్ కి హార్ట్ సర్జరీ కూడా జరిగింది . సినిమా అయితే విడుదలై సంచలన విజయం సాధించింది . 30 లక్షల బడ్జెట్ తో తెర్కక్కిన ఈ సినిమా ఆరు కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది . అలాగే తొలి వారంలోని అత్యంత వేగంగా కోటి రూపాయలు కలెక్షన్ రాబెట్టిన సినిమాగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా రికార్డు క్రియేట్ చేసింది.