మలయాళ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ కలిగిన హీరోలలో మోహన్ లాల్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొన్ని మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మోహన్ లాల్ కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో మోహన్ లాల్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఆయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇకపోతే ఇప్పటికే ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ కావడం జరిగింది. అందులో కొన్ని సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన L2E అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు.

అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీని ఏకంగా 179 నిమిషాల 52 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: