ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ లీక్స్ ప్రాబ్లం ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . అది చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు ..పొలిటికల్  కాదు వేరే ఏ రంగం కాదు అన్ని విషయాలలో లీక్స్ ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే  సినిమా నుంచి మహేష్ బాబు లుక్స్ ఒకసారి రివీల్ అయి ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.  ఒకటి కాదు రెండు కాదు దాదాపు సంవత్సర కాలం పాటు రాజమౌళి ఎంతో స్పెషల్ గా ట్రై చేసి మరి మహేష్ బాబు లుక్స్ పై కాన్సన్ట్రేషన్ చేసి ఒక క్రేజీ లుక్స్ ను తయారు చేశారు.


అయినా సరే సోషల్ మీడియాలో ఈ లీక్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది . ఇది స్టార్ సెలబ్రెటీస్ కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది . అయితే ఇకపై సినిమాకి సంబంధించి ఎటువంటి లీక్స్ రానే రాకూడదు అంటూ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారట.  మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ సెట్స్ లోకి నాట్ అలౌడ్. అంతేకాదు ఇకపై సినిమా షూటింగ్ సెట్స్ లో కుటుంబ సభ్యులను కూడా ఎవరిని ఎంకరేజ్ చేయరట . మరి ముఖ్యంగా సెట్స్ లో ఏ ఫోటో లీక్ అయితే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ జాబ్స్ తీసేయడమే కాకుండా వాళ్ళ పై స్టిక్ట్ యాక్షన్  తీసుకునే విధంగా కూడా చట్టప్రకారం ముందుకు వెళ్ళబోతున్నాడట.


రాజమౌళి నిర్ణయం భలే బాగుంది అంటున్నారు జనాలు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ లీక్స్ ప్రాబ్లం అరికట్టచ్చు అంటున్నారు  సిన్ని విశ్లేషకులు.  చూడాలి మరి రాజమౌళి తీసుకున్న నిర్ణయం ఆయన ను ఈ సోషల్ మీడియాలో లీక్స్ నుంచి ఎలా తప్పిస్తుందో..? కొంతమంది మాత్రం  సోషల్ మీడియాలో ఈ లీక్స్ ని ఆపనే ఆపలేరు.. ఇది ఒక దరిద్రం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి ఈ విషయంలో జక్కన్న ఎంత వరకు సక్సెస్ అవుతాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: