అడుగు పెడితే 500 కోట్లు వర్కౌట్ అయితే 1000 కోట్లు అన్నట్లుంది ఈమె జోరు .. ఏడాది గా బాలీవుడ్‌ను రూల్ చేస్తుంది రష్మిక మందన్నా .. ఈమె కంటే ముందు దీపిక ఇదే ప్లేస్ లో ఉంది . బాలీవుడ్లో అత్యధిక 500 కోట్ల సినిమాల రికార్డు ఇప్పటివరకు దీపికా పదుకొనే దగ్గర ఉంది .. 2023 లో ఈయన నటించిన పటాన్ , జవాన్ సినిమాలు కేవలం హిందీలోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడు రష్మిక ఈ రికార్డులు బద్దలు కొట్టింది .. పుష్ప 2 , యనిమల్ సినిమాలు హిందీలో 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి .. ఇక ఇప్పుడు తాజా గా చావాతో మూడో 500 కోట్ల కలెక్షన్ వైపు అడుగులు వేస్తుంది ఈ బ్యూటీ.
ఇక దీపిక ప్రస్తుతం ఒక అప్పటి జోరును తన కెరీర్లో చూపించలేక పోతుంది .. కల్కి 2 సినిమాకు మాత్రమే ఈమె ఒకే చెప్పింది .. కానీ రష్మిక చేతిలో వరుస క్రేజీ సినిమాలు ఉన్నాయి .. రంజాన్ కు సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సికిందర్ విడుదల కాబోతుంది. ఇది హిట్ అయితే నాలుగో సారి 500 కోట్ల క్లబ్‌లో రష్మిక చేరిపోతుంది .. బాలీవుడ్ బాక్సాఫీ దగ్గర ఎలా చూసుకున్నా రాబోయే రెండేళ్ల వరకు బాలీవుడ్ పగ్గాలు మొత్తం రష్మిక చేతుల్లోనే ఉండబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి