మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వరుస‌ క్రేజీ సినిమాల తో దూసుకు వస్తున్నాడు .. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ తో చేసిన‌ దేవర సినిమా తో సోలోగా పాన్ ఇండియా స్థాయి లో భారీ హీట్ అందుకున్నాడు .. ఈ సినిమా కు సీక్వల్ కూడా త్వరలోనే రాబోతుంది .. ఇదే క్రమంలో ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్‌ 2 సినిమా లో నటిస్తున్నాడు .. ఈ సినిమా కూడా వచ్చే ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్‌ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా పై కూడా రోజుకో వార్త బయటకు వస్తూనే ఉన్నాయి ..


 రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రశాంత్ నీల్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు తాజా గా ఈ సినిమా గురించి ఊహించిన ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది .. ఆ వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఊహించని స్పెషల్ సాంగ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది .. అలాగే ఈ పాట కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కూడా ఎంపిక చేయాలని దర్శ‌కుడు ప్రశాంత్ నీల్‌ ప్లాన్ చేస్తున్నారట .. అలాగే ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది .. అలాగే ఈ సినిమా ను ఎన్టీఆర్ కేరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో ఒకటిగా మార్చాలని నీల్‌ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు .. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్  కోసం ప్రశాంత్ నీల్‌ చాలా టైం తీసుకున్నాడు ..


అలాగే ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్‌ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలుస్తూ వచ్చాయి .. ఇదే క్ర‌మంలో రీసెంట్ గా ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్‌ మాట్లాడుతూ .. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఈ సినిమాని తీస్తున్నానని చెప్పారు .. అలాగే ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నానని కూడా చెప్పుకొచ్చాడు .. ఇలా మొత్తానికి భారీ బడ్జెట్ తో వస్తున్న ప్రశాంత్ , ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది .. మైత్రీ మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్సినిమా ను కలిసి నిర్మిస్తున్నాయి .. మరి ఈ సినిమా తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలు అందుకుంటారో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: