రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం గత కొద్ది రోజుల క్రితమే అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి రాజ్ తరుణ్ - లావణ్య ప్రేమించుకున్నారని అంతే కాకుండా రాజ్ తరుణ్ తనని వివాహం చేసుకున్నాడని లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తనని వివాహం చేసుకోలేదని చెబుతున్నాడని లావణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి వ్యవహారంలో అనేక రకాల మలుపులు తిరుగుతున్నాయి. వీరిద్దరికి సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతూనే ఉంది.


ఇక చాలా రోజుల తర్వాత మరోసారి వీరిద్దరి వ్యవహారం తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని లావణ్య ఆరోపించారు. అంతేకాకుండా తనను ఇంట్లో నుంచి గేటు వరకు జుట్టు పట్టుకొని లాక్కొచ్చారని లావణ్య చెప్పారు. నా ప్రైవేట్ పార్ట్స్ ను అసభ్యంగా తాకారని లావణ్య తెలిపారు.

అయితే లావణ్య ఉంటున్న ఇల్లు తమ కుమారుడిదే అంటూ రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు చెబుతుండగా.... 15 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నానని లావణ్య చెబుతోంది. ప్రస్తుతం ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో కొనసాగుతుందని లావణ్య అన్నారు. ఈ క్రమంలోనే లావణ్య - రాజ్ తరుణ్ కు బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని సంచలన కామెంట్లు చేసింది.

అరియానాతో ఎఫైర్ కొనసాగిస్తున్న క్రమంలోనే తనకు బ్రేకప్ చెప్పాడని లావణ్య అంటున్నారు. ఈ విషయం పైన ఇప్పటివరకు రాజ్ తరుణ్, అరియానా ఎవరు కూడా స్పందించలేదు. దీంతో వీరిద్దరి ఎఫైర్ నిజమేనని కొంతమంది అభిమానులు అంటున్నారు. కొంతమంది అభిమానులు రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేస్తుంటే.... మరికొంతమంది లావణ్యకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ విషయం పైన ఏదో క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: