ఏ సినిమాకు అయిన స్టోరీ ఎంత ముఖ్యమో.. టైటిల్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కథ ఎలా ఉన్న కూడా, ఆ కథకి తగ్గ టైటిల్ లేకపోతే ప్రేక్షకులు సంతృప్తి చెందారు. అన్నీ కరెక్ట్ గా ఉన్న, టైటిల్ సెట్ అవ్వకపోతే సినిమా ఎంత బాగున్న కూడా ప్రయోజనం ఉండదు. సినిమాకు సరైన టైటిల్ పెట్టడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మూవీ మేకర్స్ సినిమా స్టోరీ లైన్ కన్నా కూడా సినిమా టైటిల్ కోసం చాలా థింక్ చేశారు. గతంలో సినిమాల స్టోరీకి తగ్గ టైటిల్ లను.. సినిమాలోని పాత్రల ఆధారంగా, వారి ప్రవర్తన ఆధారంగా పెట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సినిమాలకు గతంలో వచ్చిన సినిమాలలోని బ్లాక్ బస్టర్ పాటలను టైటిల్ గా పెట్టుకుంటున్నారు. అలా పెట్టిన సినిమా టైటిల్స్ ని, వాటి రిజల్ట్స్ ని ఒక లుక్కేద్దాం.
 
సీనియర్ ఎన్టీఆర్ నటించిన బందిపోటు సినిమాలో ఊహలు గుసగుసలాడే అనే పాట ఉంటుంది. ఆ పాటలోని ఊహలు గుసగుసలాడే లిరిక్స్ ని నాగశౌర్య, రాశిఖన్నా కలిసి నటించిన సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన రాముడు కాదు కృష్ణుడు సినిమాలో ఒక లైలా కోసం అనే పాట ఉంది. ఆయన మనవడు నాగ చైతన్య, పూజ హెగ్డేతో కలిసి నటించిన మూవీకి ఒక లైలా కోసం అని పెట్టుకున్నారు. ఈ సినిమా మోస్తరు విజయం దక్కించుకుంది. కమల్ హాసన్ నటించిన మరో చరిత్ర సినిమాలోని భలే భలే మగాడివోయ్ పాటని నాని, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ కొట్టింది.

 
అలాగే కమల్ హాసన్, ఆమని కాంబోలో వచ్చిన శుభ సంకల్పం మూవీలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే లిరిక్స్ ని రాజ్ తరుణ్ సినిమాలో వాడుకున్నారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. మెగాస్టార్ చిరంజీవి రాక్షసుడు సినిమాలోని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సాంగ్ ని శర్వానంద్, నిత్య మీనన్ కాంబోలో వచ్చిన సినిమాకు టైటిల్ గా పెట్టారు. ఈ సినిమా హిట్ అయ్యింది. అక్కినేని నాగార్జున సినిమాలోని ఎటో వెళ్ళిపోయింది మనసు సాంగ్ ని నాని సినిమాకు పెట్టారు. ఇలా చెప్పేవే చిరుగాలి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మిస్టర్ పర్ఫెక్ట్, పిల్ల నువ్వు లేని జీవితం, కాటమరాయుడు, ఎవడే సుబ్రమణ్యం, చిన్నదాన నీకోసం, సినిమా చూపిస్త మావ, ఒకే ఒక జీవితం లాంటి సినిమాలు అన్నీ పాటల ఆధారంగా వచ్చినవే.  


మరింత సమాచారం తెలుసుకోండి: