
ఇదిలా ఉండగా.. దర్శకుడు లోకేష్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో లోకేష్ కనగరాజ్ షాకింగ్ విషయాన్ని చెప్పారు. తాను కొంత కాలం అన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. అలాగే కూలీ మూవీ ప్రమోషన్స్ అయ్యేవరకు ఈ బ్రేక్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కాస్త నిరాశ చెందారు. మరికొందరు కూలీ సినిమాతో రికార్డ్ బ్రేక్ చేయడం కోసం కాస్త బ్రేక్ తీసుకుంటున్నాడాని.. ఈ సైలెన్స్ తర్వాత చేసే సౌండ్ మామూలుగా ఉండదని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాతో అటు రజినీకాంత్.. ఇటు లోకేష్ కనగరాజ్ మంచి హిట్ అందుకొనున్నట్లు మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే దర్శకుడు లోకేష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇలా కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నారని సమాచారం. ఇక లోకేష్ కనగరాజ్ మా నగరం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ సినిమాలు చేశారు. మంచి హిట్ లను కొట్టి ప్రేక్షకులలో మనసులో గుర్తింపు సొంతం చేసుకున్నారు.