న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాతో త్వరలో థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో వచ్చే నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకులను అలరించనున్నాడు. మేలో సినిమా విడుదల ఉండడంతో మూవీ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా నాని తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మూవీ రివ్యూల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'సినిమాలకు రివ్యూలు ఇవ్వడం తప్పనిసరి. మూవీ రివ్యూలు ఇవ్వడాన్ని ఎవరు ఏం చేసిన కూడా ఆపలేరు. సినిమా చూడొచ్చా.. లేదా, అసలు సినిమా ఎలా ఉంది అనేది రివ్యూల ద్వారానే ప్రేక్షకులకు తెలుస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కొందరు క్రిటిక్స్ మాత్రం సినిమా రివ్యూలు అంటూ చాలా నెగిటివిటీ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక సినిమా అందరికీ నచ్చాలి అని లేదు. కొందరికి బాగా నచ్చిన సినిమా, మరికొందరికి అసలు నచ్చకపోవచ్చు. అలా అని చెప్పి ఒకరికి నచ్చకపోతే.. మిగితావాళ్లకి నచ్చదని రివ్యూ ఇవ్వడం మాత్రం తప్పు. థియేటర్ లో సినిమా ఆడదు అని చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులే మంచి రెస్పాన్స్ ఇస్తారు. బాలేకపోతే డిజాస్టర్ చేస్తారు.. కాని సినిమా చూసిన రోజే అది డిజాస్టర్ అని చెప్పకోడాదు. ఒక్కరోజు కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడకపోతే అప్పుడు ఆ సినిమా డిజాస్టర్ అని అనాలి' అంటూ నాని చెప్పుకొచ్చారు.

 
ఇటీవలే నాని నిర్మాతగా కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నటుడు ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ సహాయక పాత్రలను పోషించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: