
జ్యూవెల్ థీఫ్ : ది హెయిస్ట్ బిగిన్ అనే సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 25న స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ యాక్షన్ సినిమాలో సైఫ్ అలీఖాన్, జైదీప్, కునాల్ కపూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అలాగే యూ సీజన్ 5 అనే థ్రిల్లర్ సినిమా కూడా రానుంది. ఈ మూవీ నేటి నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఆడుతుంది. ఇక హవోక్ అనే డ్రగ్ డీలింగ్ సినిమా కూడా ఏప్రిల్ 25న ఓటీటీలో సందడి చేయనుంది. వీర ధీరా సూరన్ పార్ట్: 2 సినిమా ప్రైమ్ వీడియోలో నేడు రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతుంది.
మోహన్ లాల్ హీరోగా నటించిన ఎల్ 2 ఎంపూరన్ సినిమా ఓటీటీ రానుంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ మార్చి 27న థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ. 270 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఎల్ 2 ఎంపూరన్ సినిమా ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.