మలయాళ , తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది అనుపమ పరమేశ్వరన్ . మొదట ప్రేమమ్ చిత్రం ద్వారా మంచి క్రేజ్ అందుకున్న అనుపమ ఆ తర్వాత ఆఆ, కార్తికేయ 2, శతమానం భవతి తదితర చిత్రాలలో నటించి మరింత క్రేజ్ ఈ మధ్య యంగ్ హీరోలకు చిత్రాలలో నటిస్తూ గ్లామర్ హద్దులను చెరిపేస్తూ మరి లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటిస్తోంది అనుపమ. ఈమధ్య ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. గత ఏడాది టిల్లు స్క్వేర్ చిత్రం విజయాన్ని అందుకోగా ఇటీవలే డ్రాగన్ సినిమాతో మరోసారి విజయాన్ని అందుకుంది.



ఇదే ఫార్ములా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నది అనుపమ. సుందరి బైసన్, డిటెక్టివ్, JSK తదితర చిత్రాలలో బిజీగా ఉన్నది. సోషల్ మీడియాలో కూడా నిత్యం గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది హీరోయిన్ అనుపమ. అయితే ఇప్పుడు తాజాగా మరొక కొత్త ప్రాజెక్టుని ప్రకటించింది. ఒక హారర్ సినిమా చేయబోతున్నట్లు తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును సైతం షేర్ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నటువంటి BSS -11 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఇందులో సువర్ణమాయ అని ఓ రేడియో ఆఫీస్ ముందు వ్యాన్ తగలబడుతున్నట్లుగా చూపించారు. FM 919 దగ్గర పాయింట్ బార్ ఉన్న ఒక పోస్టర్ని సైతం అనుపమ షేర్ చేయడంతో ఈ పోస్ట్ కి అనుపమ మిమ్మల్ని ఒక భయంకరమైన విషయం వెంటాడుతోంది అంటూ ఒక క్యాప్షన్ కూడా జత చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: