తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులు ఎంతో మంది ఉన్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆశికా రంగనాథ్ ఒకరు. ఈ బ్యూటీ నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగొస్ అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ ద్వారా ఈమెకు పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చింది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో ఆశిక రంగనాథ్ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో ఆశిక రంగనాథ్ అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీరకట్టులో ,  స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: