టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది కెరియర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత మంచి క్రేజ్ ను సంపాదించుకొని హీరో పాత్రలలో కూడా అవకాశాలను దక్కించుకొని హీరోగా కూడా మంచి విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు ఉన్నారు. అలా కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరో అవకాశాలను అందుకొని హీరో గా కూడా మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ లో కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో శర్వానంద్ ఒకరు.

ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈయన హీరో గా నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో హీరోగా కూడా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా శర్వానంద్ "మనమే" అనే సినిమాలో హీరో గా నటించాడు. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే తాజాగా శర్వానంద్ 38 వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇక శర్వానంద్ 38 వ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ ని శర్వా 38 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృంద వారు అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని క్రేజీ వివరాలను తెలుసు కుందాం. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , డింపుల్ హయాతి హీరోయిన్లుగా కనిపించనుండగా ... సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాను పిరియాడిక్ యాక్షన్ డ్రామా జోనర్ లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: