టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన కుటుంబలలో మెగా కుటుంబం ఒకటి . ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . వారిలో చాలా మంది ప్రస్తుతం అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నా రు. మెగా ఫ్యామిలీ నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ప్రస్తుతం మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారి లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు . ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ముకుంద అనే మూవీ తో కెరియర్ను ప్రారంభించాడు . ఈ మూవీతో వరుణ్ తేజ్ కి అపజయం దక్కింది. కానీ ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఏ మూవీ ద్వారా కూడా ఈయనకు మంచి విజయం దక్కలేదు. దానితో ఈయన ప్రస్తుతం చాలా లో లో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇకపోతే జిల్ , రాదే శ్యామ్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాధ కృష్ణ దర్శకత్వంలో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన దర్శకత్వంలో రూపొందిన జిల్ , రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. ఈయన దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా రాధా కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vt