
తాజాగా డింపుల్ హయాతి శర్వానంద్ నటిస్తున్న భోగి అనే సినిమాతో మళ్లీ రీ యంట్రి ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో చాట్ నిర్వహించగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇళయరాజ సంగీతం, తెల్లచీర ఈ స్పెషల్ కాంబినేషన్ తన జీవితానికి చాలా స్పెషల్ అన్నట్టుగా తెలియజేసింది. అంతేకాకుండా తనకి ఆవులను పెంచడం అంటే చాలా ఇష్టమని అవకాశం లభిస్తే ఖచ్చితంగా గోశాలకు వస్తాను అంటూ తెలిపింది. తనకు కసారత్తులు చేయడం అన్న చాలా ఇష్టమని అందుకే సర్జరీ నుంచి కోలుకోగానే తాను జిమ్ముకి వచ్చేసానని తెలియజేస్తోంది.
తనకు నీటిలో ఆడుకోవడం అంటే మరింత సరదా అని ఎప్పుడైనా కొలను కనిపిస్తే మాత్రం అన్నిటిని మరిచిపోయి స్విమ్మింగ్ చేస్తానని తెలిపింది. అప్పుడప్పుడు ట్రిప్పుకు వెళ్లడం అంటే తనకు చాలా ఇష్టమని కూడా తెలియజేసింది. తనకు ఏనుగులు, పిల్లలు తన స్నేహితులు అంటే చాలా ఇష్టమని తన కోసమే వారిని పంపించారేమో అన్నట్టుగా ఉంటుంది అంటూ తెలుపుతోంది. తన మనసుకు దగ్గరైన రంగులలో నలుపు రంగు చాలా స్పెషల్ అని తెలిపింది. కూచిపూడి నృత్యం చేయడం తనకు బాగా ఇష్టమని తెలియజేసింది. మాటలను దుస్తులకంటే చీరకట్టులోనే చాలా అందంగా కనిపిస్తానని తెలిపింది డింపుల్ హయాతి.
అందం, అభినయం, అదిరిపోయే ఫిజిక్ ఉన్న కూడా ఎందుకో ఈ ముద్దుగుమ్మకు మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. పాత్ర ఏదైనా సరే ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించగలదు మరి భోగి సినిమాతో నైనా తన రూటుని మార్చి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.