టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ఇటీవలే తెరకెక్కించిన చిత్రం శుభం. ఈ సినిమా ట్రాలాలా పిక్చర్ బ్యానర్ పైన నిర్మించారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రానికి డైరెక్టర్గా వ్యవహరించారు. ఇందులో హర్షిత్ రెడ్డి, శ్రియ కోణతం, గవిరెడ్డి శ్రీనివాస్, శాలిని తదితరులు సైతం కీలకమైన పాత్రల నటించారు. ఈ సినిమా మొదటి పోస్టర్ నుంచి మొన్న విడుదలైన ట్రైలర్ వరకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు కూడా ఏర్పడ్డాయి.


విలేజ్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన శుభం సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇలాంటి తరుణంలో చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు చిత్ర బృందం. మే 4వ తేదీన వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో శుభం సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుందంటూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది


ఈ పోస్టర్లో సమంత ఈ సినిమాలో నటించిన ఒక సన్నివేశంలోని ఫోటోతో పాటు నటీనటులను చూపిస్తూ చచ్చినా చూడాల్సిందే అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే సమంత గత కొన్నేళ్లుగా మీడియా ముందు కనిపించడానికి పెద్దగా ఇష్టపడడం లేదు కానీ ఇప్పుడు తాను నిర్మించిన శుభం సినిమా కోసం ఏకంగా ఆంధ్రకి వచ్చి మరి అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నది. మరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత ఏ విధంగా మాట్లాడుతుందో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: