సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ల విషయంలో ఎవరికైతే మంచి విజయాలు దక్కుతూ ఉంటా యో వారికి మంచి అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి అని అనేక మంది అభిప్రా య పడతారు. కానీ కొంత మంది హీరోయిన్ల విషయం లో మాత్రం ఇది రాంగ్ అని అనేక సార్లు ప్రూవ్ అయింది. కొంత మంది నటీమణులకు పెద్దగా విజయాలు లేకపోయినా వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతూ వస్తున్నాయి. అలా విజయాలు తక్కకపోయినా సూపర్ సాలిడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నటీమణులలో పూజా హెగ్డే ఒకరు.

బ్యూటీ నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.

ఈమె 2020 వ సంవత్సరం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె అనేక సినిమాలలో నటించింది. కానీ అందులో ఏ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. అయినా కూడా ఈమెకు వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: