
అందువల్ల కొంతకాలం పాటు ప్రమోషన్స్ కు దూరంగా ఉండాలని అనిల్ రావిపూడికి చిరంజీవి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీకి టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది. విశ్వంభర విడుదలైన తర్వాతే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి.
విశ్వంభర సినిమా ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమా ఈ ఏడాది జులై నెలలో విడుదల కానుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
విశ్వంభర సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. మల్లిడి వశిష్ట ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వంభర సినిమా చిరంజీవి కెరీర్ కు ఎంతో కీలకమని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు. విశ్వంభర సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.