ఏంటి ఆ హీరో నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇప్పటికే పెళ్లయి ఓ కొడుకు ఉన్న ఆ హీరో రెండో పెళ్లికి కారణం ఏంటి.. భార్యకి నిజంగానే విడాకులు ఇచ్చేసారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరో హాల్ది ఫోటోలలో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోలు పెళ్లి విషయాలను దాచేస్తున్నారు..రహస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటూ డేటింగ్ లు చేస్తూ అప్పుడప్పుడు మీడియాకి అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. అయితే తాజాగా ఓ హీరో చేసిన పని కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఆ హీరో హల్దీ ఫొటోస్ చూసి చాలామంది షాక్ అయిపోతూ ఇదేంటి పెళ్ళై ఓ కొడుకు ఉన్న హీరో మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.

అయితే రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరో ఎవరో కాదు సుహాస్.. సుహాస్ రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అని మీరందరూ ఆశ్చర్యంలో మునిగిపోవచ్చు. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఫొటోస్ చూస్తే మీరందరూ నిజమే అనుకుంటారు. అయితే తాజాగా హీరో సుహాస్ హాల్ది వేడుకలలో ఉన్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేశారు. ఈ హాల్ది ఫోటోలలో హీరో సుహాస్ చాలా స్టైల్ గా ఫోజులు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ ఫొటోస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో చాలామంది నెటిజన్లు సుహాస్ హల్ది ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు.ఇదేంటి సుహాస్ కి ఇప్పటికే పెళ్లయింది కదా..మళ్ళీ హల్ది ఫొటోస్ షేర్ చేసారు ఏంటి అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే..
మరి కొంత మందేమో రెండో పెళ్లి చేసుకోబోతున్న సుహాస్ అని కామెంట్లు పెడుతున్నారు. అయితే సుహాస్ రెండో పెళ్లి చేసుకోకపోయినప్పటికి సోషల్ మీడియా నెటిజన్స్ పెట్టిన కామెంట్లు మాత్రం ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో చాలామంది యూట్యూబర్లు రెండో పెళ్లి చేసుకోబోతున్న సుహాస్ అంటూ థంబ్ నెయిల్స్ క్రియేట్ చేసి మరీ ఆయనకు సంబంధించిన ఫోటోలు వైరల్ చేస్తున్నారు.అయితే సుహాస్ షేర్ చేసిన ఈ ఫోటోలు హల్దీ ఫొటోస్ అనేది నిజమే. కానీ అది ఆయన పెళ్లి ఐతే కాదు. ఆయన తన స్నేహితులు లేదా బంధువులకు సంబంధించిన పెళ్లి వేడుకల్లో పాల్గొని ఇలా హాల్ది ఫొటోస్ పంచుకున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఇక కలర్ ఫోటో సినిమాతో టాలీవుడ్ లో స్టార్ అయిన ఈయన ఈ సినిమా కంటే ముందు పడి పడి లేచే మనసు, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అలాగే అడివి శేష్ నటించిన హిట్-2  మూవీలో సైకో విలన్ గా కూడా నటించి అటు విలన్ గా ఇటు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీబిజీగా ఉన్నారు. సుహాస్ చిన్న హీరో అయినప్పటికీ ఈయన నటించిన సినిమాలన్నీ కూడా కంటెంట్ బాగుండడంతో చాలామంది సుహాస్ సినిమాలని ఇష్టంగా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: