కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లు ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్తలో అద్భుతమైన విజయాలను అందుకుంటూ వెళ్ళాడు. ఇక ఆ తర్వాత ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా దూకుడు అనే సినిమాలు తెరకెక్కించాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఒక్క సారిగా శ్రీను వైట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం ఇప్పటివరకు శ్రీను వైట్ల కు దూకుడు రేంజ్ విజయం దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన వరుస పెట్టి భారీ అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు.

కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈయన గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడమ విడుదల అయింది. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపలేకపోయింది. ఇక ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ రావడంతో ఈయనకు క్రేజీ నిర్మాణ సంస్థల్లో అవకాశాలు రావడం కష్టం అని చాలా మంది భావించారు. కానీ శ్రీను వైట్ల టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలో తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు శ్రీను వైట్ల దర్శకత్వంలో మూవీ నిర్మించడానికి రెడీ అయినట్లు , ప్రస్తుతం శ్రీను వైట్ల కూడా మైత్రి మూవీ సంస్థ నిర్మించబోయే సినిమాకు కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి శ్రీను వైట్ల ప్రస్తుతం వరుస అపజాయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. మరి తన తదుపరి మూవీ తో అయిన మంచి విజయాన్ని అందుకొని ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: