
అయితే ఆ తర్వాత అనుష్క కొన్ని సినిమాలను ఓకే చేసినట్లు తెలుస్తుంది . మరీ ముఖ్యంగా వాటిల్లో ఖైదీ 2 సినిమా కూడా ఉంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ లీడ్ పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క ఒక శక్తివంతమైన లేడీ డాన్ పాత్ర కోసం సంప్రదించారట మూవీ మేకర్స్ . అంతేకాదు ఆమె పాత్ర మొత్తం చాలా చాలా టఫ్ గా ఉండబోతుందట. స్క్రీన్ పై ఇప్పటివరకు ఎప్పుడు చూడని లుక్స్ లో మనం అనుష్క ఈ పాత్రలో చూడాల్సి వస్తుంది.
అయితే అనుష్క ప్రయోగాలు చేయాలి అంటే ముందుంటుంది . డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎప్పుడు చూస్ చేసుకుంటుంది .ఆ కారణంగానే ఈ సినిమాను ఓకే చేసిందట . దీంతో మనం అనుష్క ని డిఫరెంట్ లుక్ లో చూడబోతున్నాం . రగ్డ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ గా ఆమె స్క్రీన్ పై కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో ఆమె నోటి నుండి కొన్ని కొన్ని బూతు డైలాగ్స్ కూడా వినిపిస్తారట డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా డాన్ పాత్రలో కనిపించలేదు . ఇప్పుడు అనుష్క అలాంటి పాత్రలో కనిపించడానికి సిద్ధం అవ్వడంతో సినీ వర్గాలలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూడాలి మరి ఈ సినిమా అనుష్కకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో..????