ప్రముఖ మలయాళ నటుడుగా పేరుపొందిన ఫహద్ ఫాజిల్ .. తెలుగు ప్రేక్షకులకు కూడా తన డబ్బింగ్ సినిమాలతో పాటుగా పుష్ప చిత్రాలతో భారీ క్రేజీ సంపాదించుకున్నారు. తాజాగా ఈ నటుడు ఫోక్స్ వ్యాగన్  గోల్ఫ్ GTI కారును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వ్యాగన్ సంస్థ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఇండియాలో మార్కెట్ కోసం కేటాయించినటువంటి వెహికల్స్లలో GTI -150 యూనిట్లలో ఈ కారు కూడా ఉండడం గమనార్హం. ఫహద్ ఫాజిల్  కొనుగోలు చేసిన ఈ కారు ఫీచర్స్ గురించి చూద్దాం.


ఫహద్ ఫాజిల్  కొనుగోలు చేసిన ఫోక్స్ వ్యాగన్  కారు విషయానికి వస్తే ఇది గ్రేనాడీల్లా బ్లాక్ మెటాలిక్ కలర్లో ఉంటుంది. అయితే దీని ధర ప్రారంభం రూ .53 లక్షల రూపాయలు ఉంటుంది.2.0 లీటర్ల ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో కలదు. ఈ వెహికల్ గరిష్టంగా 265 హార్స్ పవర్ తో  వెళ్తుంది.. ఇంజన్ సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కలదు. ఫోక్స్  వ్యాగన్  కారు కేవలం 5.9 సెకండ్లలోనే 0-100 K/M వేగంతో స్పీడ్ తో వెళ్తుందట.


ఈ కారు కొన్న తర్వాత అభిమానులు కూడా ఫహద్ ఫాజిల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫహద్ ఫాజిల్  గ్యారేజీలో చాలా రకాల కార్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో ఈ కారు కూడా చేరింది..ఫహద్ ఫాజిల్  చిత్రాల విషయానికి వస్తే గత ఏడాది ఏకంగా మూడు చిత్రాలలో నటించారు. అందులో ఒకటి ఆవేశం సినిమా కాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పుష్ప 2 చిత్రంతో మరొకసారి మంచి విజయాన్ని అందుకున్న ఫహద్ ఫాజిల్  రజనీకాంత్ నటించిన వెట్టాయాన్ చిత్రంలో కూడా  నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ చేతిలో సుమారుగా ఆరు సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: