కోలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే ఆ సినిమా స్టార్ట్ కాకముందే ఆ మూవీ పై తమిళ ఆడియన్స్ లో అంచనాలు భారీ స్థాయికి చేరిపోతు ఉంటాయి. అలాగే ఈయన నటించిన సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేసిన వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి రావడం , ఇక సినిమా విడుదల అయిన తర్వాత దానికి హిట్ , ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రావడం , అదే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో కలెక్షన్ల వర్షం కురవడం జరుగుతూ ఉంటుంది.

అంతటి క్రేజ్ కలిగిన ఈ నటుడి నటించిన ఈ సినిమా గ్లీమ్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ఏవి విడుదల అయినా కూడా అవి కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటాయి. ప్రస్తుతం విజయ్ , హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లీమ్స్ వీడియో విడుదల అయిన 24 గంటల సమయంలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న మన తెలుగు సినిమాల గ్లిమ్స్ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయాయి.

జన నాయగన్ మూవీ గ్లీమ్స్ వీడియోకు 24 గంటల్లో 22.57 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది మూవీ గ్లీమ్స్ వీడియోకి 24 గంటల్లో 31.51 మిలియన్ వ్యూస్ దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప 2 హిందీ వర్షన్ గ్లీమ్స్ వీడియోకు 24 గంటల్లో 27.67 మిలియన్ వ్యూస్ దక్కాయి.  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ గ్లీమ్స్ వీడియోకు 24 గంటల్లో 26.17 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: