మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , శరత్ కుమార్ , మోహన్ బాబు , కాజల్ అగర్వాల్ లాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీన టులు నటించారు. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ముఖ్యంగా ప్రభాస్ లాంటి భారీ క్రేజ్ ఉన్న హీరో ఈ సినిమాలో నటించడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలు తగినట్టుగానే చాలా మంది సినిమాలో ప్రభాస్ వచ్చే సన్నివేశం అద్భుతంగా ఉంది అని , అలాగే ప్రభాస్ సినిమాలో కనిపించినంత సేపు అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపించాడు అని , ప్రభాస్ సినిమాకే అద్భుతమైన రీతిలో ప్లస్ అయ్యాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ... కన్నప్ప సినిమాలో ఆఖరి ఘంట సమయంలో ప్రేక్షకులు కన్నప్ప సినిమాతో ప్రేమలో పడిపోయారు అని తెలిపాడు.

అందరూ ప్రభాస్ వచ్చాక మూవీ మారింది అని అనుకుంటున్నారు. కానీ నాకు , శరత్ కుమార్ మధ్య జరిగిన సన్నివేశంతో ఆడియన్స్ మూవీ కి అద్భుతంగా కనెక్ట్ అయిపోయారు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరియు అద్భుతమైన స్టార్ డం వల్ల అక్కడి నుండి అని జనాలు అనుకుంటున్నారు. నాకు , శరత్ కుమార్ కి మధ్య వచ్చే సీన్ తో ప్రేక్షకులు మూవీ కి కనెక్ట్ అయ్యారు. ప్రభాస్ వచ్చాక అది మరింత ఎక్కువ స్థాయికి చేరింది అని విష్ణు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: