నయనతార డేటింగ్ చేసిన హీరోలు అనే పేర్లు వినిపించగానే ప్రభుదేవా శింబుల పేర్లే బయటికి వస్తాయి.అయితే నయనతార పేరు వీరిద్దరితోనే కాకుండా వేరే సెలబ్రిటీలతో కూడా వినిపించినప్పటికీ ప్రభుదేవా, శింబులతో ఉన్న లవ్ మాత్రం చాలా రోజులు కంటిన్యూ అయింది. ఇక ప్రభుదేవాతో నయనతార పెళ్లి వరకు వెళ్లినప్పటికీ సడన్గా వీరి మధ్య ఏదో జరిగి ఇద్దరు విడిపోయారు. ఇక చివరికి శింబు ప్రభుదేవా ను పక్కనపెట్టి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడింది.ఈ విషయం పక్కన పెడితే.. శింబు కోలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకొని లేడీస్ మాన్ అనే ట్యాగ్ ని కూడా సంపాదించారు. ఎందుకంటే శింబు ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశారనే టాక్ కోలీవుడ్ లో ఉంది. అయితే శింబు నయనతార తో చాలా రోజులు డేటింగ్ చేశారు.ఇక నయనతారతోనే కాదు నయనతార చెల్లెలిపై కూడా శింబు కన్నేసారంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. మరి నయనతార కు చెల్లెలు లేరు కదా.. ఈ కొత్త చెల్లెలు ఎక్కడినుండి వచ్చి పడింది అని చాలా మంది అనుకుంటారు. 
ఇక నయనతార చెల్లెలు అంటే ఎవరో కాదు నయనతార నటించిన సినిమాలో నయనతార కి చెల్లెలు పాత్రలో నటించిన హీరోయిన్.ఇక విషయంలోకి వెళ్తే.. శింబుకి భరతనాట్యం కూడా వచ్చు.అయితే ఆ భరతనాట్యం నేర్పించింది ఎవరో కాదు నటి శరణ్య మోహన అట. తమిళ, మలయాళ, హిందీ,తెలుగు పలు సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శరణ్య మోహన్ అంటే తెలియని వారు ఉండరు. శరణ్యమోహన్ ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలు పాత్రల్లో నటించింది.అలా కళ్యాణ్ రామ్ కత్తి మూవీలో కళ్యాణ్ రామ్ కి చెల్లిగా, అలాగే నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు మూవీలో హీరోయిన్ గా నటించింది. అలాగే నయనతార ధనుష్ కాంబోలో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీ రీమేక్ గా తెరకెక్కిన యారాడి నీ మోహిని అనే సినిమాలో నయన్ చెల్లెలి పాత్రలో నటించింది.
ఇక తెలుగులో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీలో త్రిష చెల్లెలు పాత్రలో కలర్స్ స్వాతి నటించింది. అలా నయనతారకు చెల్లెలు పాత్రలో నటించిన శరణ్య మోహన్ దగ్గర శింబు  క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారట. ఈ విషయాన్ని రీసెంట్ గా శరణ్య మోహన్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.అయితే శింబు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు చిన్న దెబ్బ తగలడంతో హాస్పిటల్ కి వెళ్ళగా హాస్పిటల్ లో శరణ్య భర్త వైద్యం చేశారట. అయితే ఈ విషయం తెలుసుకున్న శరణ్య హాస్పిటల్ కి వచ్చి శింబుని పరామర్శించిందట. ఇక ఆ టైంలోనే నాకు భరతనాట్యం నేర్చుకోవాలని ఉంది.ఎవరైనా భరతనాట్యం నేర్పించే మగ క్లాసికల్ డాన్సర్ గురించి నాకు చెప్పండని శింబు అడగగా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ మీకు అభ్యంతరం లేకపోతే నేను నేర్పిస్తానని శరణ్య చెప్పిందట.దాంతో శింబు ఓకే చెప్పి శరణ్య దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారట.. అయితే ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్లో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజెన్స్ నయనతారనే కాదు నయనతార చెల్లెలి మీద కూడా శింబు కన్నెసారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: