విలన్ గా.. కామెడీ విలన్ గా.. విభిన్న పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు ఇకలేరు. ఆయన వృద్ధాప్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు.ప్రస్తుతం ఆయన భౌతిక కాయం ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో ఉంది.ఈరోజు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే కళ్ళముందే కొడుకును పోగొట్టుకున్న కోటా శ్రీనివాసరావు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఇక కోట శ్రీనివాసరావు మరణంతో ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే కోట శ్రీనివాసరావు కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించారు. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చిన ఫస్ట్ టైమే ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 1999లో బిజెపి తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే కోట శ్రీనివాసరావు రాజకీయాల్లోకి రావడానికి ఒకే ఒక్క కారణం గన్ మెన్ లట. 

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కోట శ్రీనివాసరావు తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన బాబు మోహన్ ఎమ్మెల్యే అయ్యి గన్ మెన్లతో షూటింగ్ కి రావడంతో నీకెందుకురా గన్ మెన్ లు అంటూ కోట శ్రీనివాసరావు కుళ్లుకునేవారట.అలా కేవలం గన్ మెన్ ల కోసమే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలిచి నాక్కూడా గన్ మెన్ లు ఉన్నారు చూడు అని బాబు మోహన్ ని అనేవారట. అలాగే అసెంబ్లీకి వెళ్తే కోటా చివరి వరుసలో బాబు మోహన్ మొదటి వరుసలో కూర్చునే వారట.దాంతో నువ్వు ఎందుకురా అక్కడ కూర్చుంటావ్. నా పక్కనే కూర్చో అని గొడవ చేసేవారట. ఎంత చెప్పినా కూడా వినకపోయేవారట.ఎవరి సీట్లలో వాళ్లే కూర్చోవాలి అన్నా అని చెప్పినా కూడా కోటా పట్టించుకునే వారు కాదట. మనిద్దరం అన్నదమ్ములం పక్కపక్కనే కూర్చోవాలి అని చెప్పేవారట. ఇక అదే సమయంలో బాబు మోహన్ మంత్రి కావడంతో కోటా మరింత కుళ్ళుకున్నారట.

నీకు మంత్రి పదవి ఎందుకురా.. నువ్వు ఎందుకురా అక్కడ కూర్చుంటావు అని కుళ్లుకొని మాట్లాడే వారట. అయినా కూడా బాబు మోహన్ అంతగా పట్టించుకునే వారు కాదట.నేను మంత్రిని నేను ఇక్కడే ఉంటా నువ్వు అక్కడే ఉండాలి అని కోటాని అప్పుడప్పుడు బాబు మోహన్ ఆట పట్టించే వారట. అలా చాలా రోజులు కోట శ్రీనివాసరావు బాబు మోహన్ పై కుల్లుకొని ఆయన హర్ట్ అయ్యేలా మాట్లాడే వారట.ఇక చివరికి ఎన్ని రోజులైనా నేను మంత్రి కాలేను అని తెలుసుకొని అసెంబ్లీకి రావడం కూడా మానేశారట. అంతేకాకుండా ఒకేసారి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయి ఆ తర్వాత రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు.అయితే ఈ విషయాలన్నీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ చెప్పుకొచ్చారు. కోటా అన్నయ్య కేవలం నేను గన్ మెన్ లని తెచ్చుకుంటున్నాను అన్న కుళ్ళు తోనే ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచి గన్ మెన్ లను తెచ్చుకున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: