సినిమా ఇండస్ట్రీకి నేడు చీకటి రోజు అనే చెప్పాలి. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఎన్నో సినిమాలలో నటించి తనదైన స్టైల్ లో జనాలను మెప్పించి కడుపుబ్బ నవ్వించి .. సినిమా ఇండస్ట్రీని  ఇంకా ఇంకా పైకి ఎదిగేలా చేసిన టాలెంటెడ్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు మరణించారి. ఈ విషాద వార్త సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది . 83 సంవత్సరాల కోటా శ్రీనివాసరావు గారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య కారణంగా బాధపడిపోతున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు .

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే కోటా శ్రీనివాసరావు ని "మీ ఫేవరెట్ హీరో ఎవరు..?" అని అడిగితే మాత్రం నిర్మొహమాటంగా ఎన్టీఆర్ పేరు చెప్పేస్తాడు.  చాలా సందర్భాలలో టాలీవుడ్ ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరో ఆయనే అంటూ బాగా వాదించారు.  జూనియర్ ఎన్టీఆర్ నటన బాగుంటుంది అని.. స్టైల్ బాగుంటుంది అని..ఆయన యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయని .. మరి ముఖ్యంగా పెద్ద వాళ్లతో ఎలా నడుచుకోవాలి అన్న పద్ధతి తెలిసిన హీరో అని.. సీనియర్ ఎన్టీ రామారావు గారి తర్వాత ఇండస్ట్రీలో అలాంటి స్థాయిని అందుకునే సత్తా ఉన్న ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఎన్నో సందర్భాలలో కోట శ్రీనివాసరావు గారు పొగిడేశారు. అంతేకాదు తారక్ తో ఉన్న చనువు , అనుబంధం గురించి కూడా చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు . వీళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ప్రతి సినిమాలో కూడా వీళ్ళ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కోటా శ్రీనివాసరావు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే మాత్రం ఆ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేవాళ్ళు . అంతలా వాళ్ళ కాంబో హిట్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి . రాఖీ, స్టూడెంట్ నెంబర్ వన్, బృందావనం,దమ్ము ఇలా చాలా చాలా సినిమాలలో వీళ్ళు స్క్రీన్ షేర్ చేసుకున్నారు ." అంతేకాదు కోటా శ్రీనివాసరావు తారక్ ని ఎక్కడ కనిపించిన సరే ముందు బాగున్నావా..?  అంటూ పలకరించి నీ సినిమాలో నాకు ఛాన్స్ ఎప్పుడు ఇస్తావ్ రా అబ్బాయ్" అంటూ సరదాగా మాట్లాడుతాడట.  ఎప్పుడు కనిపించిన సరే తారక్ ని " నాకు చాన్స్ ఇవ్వరా అబ్బాయ్ "అంటూ ప్రేమగా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడతారట . ఈ విషయాలు చాలా సందర్భాలలో కూడా శ్రీనివాసరావు బయట పెట్టారు . అలాంటి మంచి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు.  ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. మల్టీ టాలెంటెడ్ కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీలో లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది అంటూ పలువు సినీ  ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: