సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి కొన్ని సినిమాల్లో నటించాక అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. ఇక మరి కొంత మంది కి మాత్రం నటించిన ఒకటి రెండు సినిమాలతోనే అద్భుతమైన క్రేజ్ వస్తుంది ఉంటుంది. ఇకపోతే ఓ బ్యూటీ తెలుగు లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆమె నటించిన పరాయి భాష సినిమా ద్వారానే ఈమెకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు వచ్చింది. మరి తెలుగు లో ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి దివ్య భారతి. ఈమె ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈమె కొంత కాలం క్రితం  తమిళ్లో బ్యాచిలర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అయింది. 

ఈ సినిమాలో ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఈమె కొంత కాలం క్రితం జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా హీరో గా స్టార్ట్ అయిన గోట్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతానికైతే ఏమీ రావడం లేదు. ఈ మూవీ విడుదల అయ్యి మంచి విజయం అందుకుంటే ఈ బ్యూటీ క్రేజ్ ఈ సినిమా ద్వారా తెలుగులో మరింత పెరిగే అవకాశం ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈమె ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. దానితో ఈమె కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తోంది. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

db