సినీ ఇండస్ట్రీలోకి కొత్త హీరోగా పరిచయం అవుతున్న కిరీటిరెడ్డి నటించిన తాజా చిత్రం జూనియర్.. ఈనెల 18వ తేదీన థియేటర్లో చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. యాక్షన్ ,ఎమోషన్స్ ,ఎంటర్టైన్మెంట్ అన్ని కలిపిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. విడుదలైన ట్రైలర్లో సాంగ్స్ సినిమా పైన పాజిటివ్ బజ్ కొంత మేరకు ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రం కోసం హీరోయిన్ శ్రీ లీల తీసుకున్న రెమ్యూనరేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం.. హీరోయిన్ శ్రీ లీల జూనియర్ సినిమా కోసం ఏకంగా  రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల సరసన నటిస్తున్న ఈ మద్దుగుమ్మ ఈ స్థాయిలో డిమాండ్ చేయడం పెద్దదేమి కాదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పలు రకాల బ్లాక్ బస్టర్ చిత్రాలను నటించిన తర్వాత శ్రీ లీల క్రేజీ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లుగా కనిపిస్తోంది. ఈమధ్య బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది శ్రీ లీల.


జూనియర్ చిత్రంలో కీలకమైన పాత్రలో అలనాటి హీరోయిన్ జెనీలియా కూడా నటిస్తోంది. చాలాకాలం తర్వాత మళ్లీ తిరిగి తిరిగి ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఈమె క్యారెక్టర్ పై అభిమానులు ప్రత్యేకంగా ఎక్సైటింగ్ గా ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అందిస్తున్న మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి జూనియర్ సినిమా కిరీటి రెడ్డి కోసం ఒక పర్ఫెక్ట్ లాంచ్ అవుతుందా? లేదా అన్నది చూడాలి. మరి శ్రీలీల అందుకున్న రెమ్యూనరేషన్ కి తగ్గట్టుగా బొమ్మ సక్సెస్ అవుతుందా లేదా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: