
భార్య కోరిక కోసం … అభిమాని చిరంజీవి భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమె చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్. తనకు జీవితం తీరక ముందే మెగాస్టార్‌ను ఒకసారి చూడాలని ఆమె కోరిక. ఆ కోరికను నిజం చేయాలన్నదే భర్త చిరంజీవి లక్ష్యం. తన భార్యను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి మెగాస్టార్‌ను కలవడానికి వచ్చారు. చిరు స్పందన – నిజమైన స్టార్ హార్ట్ ... వారిని చూసిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆప్యాయతగా పలకరించారు. భక్తిగా చిరంజీవి కాళ్లకు అభిమాని దండం పెట్టబోతే, “అయ్యో వద్దు” అంటూ ఆపారు చిరు. కానీ అది తన భార్య కోరిక అని చెప్పిన తర్వాత, చిరు అనుమతించి ఆశీర్వదించారు. అనంతరం వారికి ప్రత్యేకంగా ఫోటోలు దిగి, ఆ మధుర క్షణాలను మరపురానివిగా మలిచారు.
వైరల్ అవుతున్న వీడియో - మెగాస్టార్ మనసు ... ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. “చిరంజీవి అంటే అభిమానానికి విలువ ఇచ్చే మనిషి”, “ఇలాంటి ఘటనలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి”, “మెగాస్టార్ చిరంజీవి నిజంగా బాస్” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇది కేవలం ఓ అభిమాన కథ కాదు … ఇది అభిమానానికి అర్థం చెప్పే ఉదాహరణ. మెగాస్టార్ చిరంజీవి ఎందుకు లక్షలాది హృదయాల్లో స్థానం సంపాదించారో మరోసారి తేలిపోయింది. అభిమానాన్ని అభిమానం లాగే చూసే గొప్ప మనిషిగా మెగాస్టార్ చిరు నిలిచారు.