మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మలయాళ సినిమాల ద్వారా నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె మలయాళం లో ప్రేమమ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమె మొదటగా నితిన్ హీరోగా రూపొందిన "అ ఆ" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో అనుపమ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరస పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె ఇప్పటికే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ స్కిన్షో కి కూడా చాలా దూరంగా ఉంటూ వచ్చిన ఈమె ఈ మధ్య కాలంలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. దానితో ఈమెకు యూత్ ఆడియన్స్ లో క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఆగస్టు 22 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి అనుపమ షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి అనుపమ మాట్లాడుతూ ... లేడీ ఓరియంటెడ్ సినిమాలకు నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు , మరియు ఓ టీ టీ యాజమాన్యాలతో పాటు ప్రేక్షకులు కూడా దూరంగా ఉంటున్నారు అని అనుపమ చెప్పుకొచ్చింది. ఈ సినిమా దాదాపు సంవత్సరం క్రితమే సిద్ధం అయ్యింది. కానీ ఒక మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తూ పెద్ద సినిమాలు రావడంతో పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాము అని అనుపమ చెప్పుకొచ్చింది. మరి అనుపమ "పరదా" సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: