
ఆది పురుష్ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో.. ఎంత రేంజ్ లో ఆ సినిమాను ప్రమోట్ చేసారు.. అన్నది అందరికీ తెలుసు . అయితే VFXఎఫెక్ట్స్ చీప్ గా ఉన్నాయి అన్న కారణంగా సోషల్ మీడియాలో దాదాపు 6 నెలల పాటు ప్రభాస్ కి కంటిమీద కునుకు లేకుండా ట్రోల్ చేశారు కొంతమంది ఆకతాయిలు . ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది VFXఎఫెక్ట్స్ లేకపోయినా పర్వాలేదు కానీ పెడితే మంచిగానే పెట్టాలి అంటూ డిసైడ్ అయ్యారు. ఆ కారణంగానే వ్FX ఎఫెక్ట్స్ కి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెడుతూ వచ్చారు మేకర్స్ . అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో చీప్ VFX ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండి పడిపోయారు. హరిహర వీరమల్లు సినిమా చూసిన ఎవరికైనా సినిమా అంతా బాగుంది కానీ అంటూ ఒక రెండు సెకండ్లు కామా అంటూ ఆలోచిస్తారు.
దానికి మెయిన్ రీజన్ VFX ఎఫెక్ట్స్ . ఈ ఎఫెక్ట్స్ లో పవన్ కళ్యాణ్ ని చూస్తే ఒక కార్టూన్ బొమ్మలాగే అనిపించింది తప్పిస్తే ఎక్కడ రియాలిటీ లేదు . చిన్న హీరోల సినిమాల విషయానికైతే బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ..అర్థం చేసుకోవచ్చు . కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా అందులోనూ ఏ ఎం రత్నం లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ..ఇక డబ్బుకు లోటు ఏముంది అని మాట్లాడుకుంటున్నారు అభిమానులు. కాగా హరిహర వీరమల్లు సినిమా రివ్యూ చూసిన ..చదివినా.. రాసిన ప్రతి ఒక్కరూ కూడా VFX గురించి నెగిటివ్ గానే మాట్లాడుతూ వచ్చారు.
నిజానికి సినిమా మొత్తం సూపర్ డూపర్ హిట్ అయినా పంటికింద రాయిలా ఈ VFX బాగాలేవు అన్న కామెంట్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇస్తున్నాయి . పవన్ కళ్యాణ్ ఫాన్స్ కే కాదు పవన్ కళ్యాణ్ కి కూడా అది కొంచెం ఇబ్బందిగా మారిందట . సినిమా మొత్తం మంచి టాక్ దక్కించుకొని ఈ VFX ఏంటి ఇలా తయారయింది అంటూ మేకర్స్ బాధపడిపోతున్నారట అందుకే . ఈ వి ఎఫ్ ఎక్స్ సీన్స్ అన్ని సినిమా నుంచి ట్రిమ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా హరి హర విరమల్లు రిజల్ట్ పై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సినిమా హిట్ అన్న టాక్ వచ్చిన సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఏంటి VFX ఎఫెక్ట్స్ నిజంగానే బాగాలేవు అంటూ మేకర్స్ తో సైతం కొంచెం డిసప్పాయింట్మెంట్ తో మాట్లాడారట..!!