
డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న తర్వాత .. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత విఎఫ్ఎక్స్ మీద స్పెషల్ ఫోకస్ చేశారనే విధంగా వార్తలు వినిపించాయి. సినిమా ఆలస్యం కావడానికి ముఖ్య కారణం బెటర్ అవుట్ ఫుట్ కోసమే ఆలస్యమైందని చిత్ర బృందం ఎన్నోసార్లు తెలియజేశారు. ఇక ట్రైలర్ కట్ చేసినప్పుడు గ్రాఫిక్స్ అంతా బాగుండడంతో ఖచ్చితంగా సినిమా మరో స్థాయిలో ఉంటుందని అభిమానులు భావించారు. కానీ తీరా చూస్తే ఇందులో గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉందని సెకండాఫ్ లో చాలా సన్నివేశాలు ట్రోలింగ్ కి గురవుతున్నాయి.
కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఐదేళ్ల సమయం తీసుకుని మరి ఇలాంటి నాసిరకం విఎఫ్ఎక్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇందులో సీన్స్ కార్టూన్ సినిమాలను తలపించేలా ఉన్నాయంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే సన్నివేశాల గురించి ఎక్కువమంది మాట్లాడుతున్నారట. అయితే కొన్ని సీజీ వర్కు సకాలంలో పూర్తి కాకపోవడంతో మరొకపక్క ఓవర్సీస్ కాపీలు లేట్ అవుతున్నాయని గుర్తించి మేకర్స్ ఏం చేయాలో తెలియక ముందు చేసిన విఎఫ్ఎక్స్ తోనే కాపీలను పంపేశారని టాక్ వినిపిస్తోంది.
దీంతో హరిహర వీరమల్లు చిత్ర బృందం ఈ తప్పుకు దిద్దుబాటు చర్యలో భాగంగా ఆ నాసిరకమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలను ట్రిమ్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. సుమారుగా 10 నుంచి 20 నిమిషాల వరకు కొన్ని సన్నివేశాలను తగ్గించబోతున్నట్లు వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.