
వాల్తేరు వీరయ్య" సినిమాలో ఈ పాట బాగా హిట్టవ్వడం వల్ల అదే టైటిల్‌ను కొత్త సినిమాకు పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. చిరంజీవి ప్రస్తుతం "విశ్వంభర" సినిమాలో, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల తర్వాత బాబీతో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. చిరంజీవి లైనప్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ టైటిల్ విన్న అభిమానులు మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి బాబీ కాంబో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టర్ బాబీ గత సినిమా డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచినా మరీ అద్భుతాలు అయితే చేయలేదు. బాబీ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
చిరంజీవి బాబీ కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. చిరంజీవి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు