
వినోద రంగానికి సంబంధించి సేవలందించినందుకు గాను ప్రతి ఏడాది కొంతమంది సెలబ్రిటీలకు ఈ గౌరవాన్ని అందిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈసారి మోషన్ పిక్చర్స్ విభాగంలో హీరోయిన్ దీపికా ఎంపిక కావడం గమనార్హం. ఇక ఈ జాబితాలోనే కొంతమంది హాలీవుడ్ తారలు (రాచల్ మెక్ఆడమ్స్ , డెమి మూర్ , జోయ ) ఇలా మొత్తం మీద 35 మంది ప్రముఖులకు ఈ గౌరవం లభించింది. అయితే ఇండియా నుంచి ఈ గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి హీరోయిన్ గా పేరు సంపాదించింది దీపికా.
దీపికా పదుకొనే వ్యక్తిగత విషయానికి వస్తే ఇమే ఇండియాలోనే ఒక గొప్ప నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఇలాంటి గౌరవం ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలు ఎవరూ కూడా దక్కకపోవడం జరిగింది. దీపికా తన అంతర్జాతీయ గుర్తింపుతో ప్రత్యేకతతో మరి ఈ ఘనతను అందుకోవడంతో మరొకసారీ తన స్టామినా నిరూపించుకుందంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎలాంటి విషయాలనైనా సరే నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటుంది దీపికా పదుకొనే. 2006లో మొదటిసారి ఐశ్వర్య అనే కన్నడ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన దీపికా.. ఆ తర్వాత ఓం శాంతి ఓం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 22 వ చిత్రంలో నటిస్తోంది.