తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటీమణులలో శ్రీ లీల ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో నటించింది. శ్రీ లీలకు భారీ సంఖ్యలో విజయాలు లేకపోయినా ఈమె నటించిన చాలా సినిమాల్లో ఈమె తన అందంతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. దానితో వరస పెట్టి ఈమెకు అదిరిపోయే రేంజ్ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఈమె ప్రస్తుతం కార్తిక ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఈ మూవీతో ఈమె హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈమెకు సంబంధించిన ఓ పుకారు తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా హిందీలో సైయారా అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ఇప్పటికే భారీ కలెక్షన్లను  సాధించింది. ఈ మూవీ ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సైయారా సినిమాలో హీరోయిన్ కి నయం కానీ జబ్బు ఉంటుంది.

దానితో సినిమా కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా శ్రీ లీల ఒక న్యాయం కాని వ్యాధితో బాధపడుతుంది అని , దానితో సినిమా కథ అనేక మలుపులు తిరుగుతుంది అని , ఈ కథ దాదాపు సైయారా  కథ లాగానే ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. దీనితో ఈ సినిమా దర్శకుడు అయినటువంటి అనురాగ్ బసు స్పందిస్తూ మా కథకు సైయారా కథకు ఏ మాత్రం సంబంధం లేదు అని మాది పూర్తిగా కొత్త కథ అని ఆయన వివరణ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: