టాలీవుడ్‌లో దర్శకధీరుడు అని కీర్తింపు పొందిన ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాకు ఎంత టైమ్ పడినా, రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ సినిమారంగం దృష్టిని తనవైపుకు తిప్పిన జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 కోసం కూడా అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఇదిగో.. అలాంటి డైరెక్టర్ రాజమౌళి చెప్పిన కథను ఓ పెద్ద హీరో రిజెక్ట్ చేశాడంటే ? అదీ ఈజీగా కాదు.. స్క్రిప్ట్ నచ్చలేదని ఓపెన్‌గా చెప్పేశాడట !


 ఆ హీరో మరెవరో కాదు – రెబల్ స్టార్ ప్రభాస్! ఇదే నిజం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా "స్టూడెంట్ నెంబర్ 1". ఈ సినిమా మొదటగా ప్రభాస్‌కి ఆఫర్ అయిందట. కథ వినగానే డార్లింగ్‌కు నచ్చలెదట. దీంతో జక్కన్న నిరాశ చెందారట. కట్ చేస్తే.. అదే కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన మూవీ అయింది. అప్పటి వరకు పెద్దగా మార్కెట్ లేని ఎన్టీఆర్, ఆ సినిమా హిట్‌తో స్టార్‌గా నిలిచిపోయాడు. ఆ హిట్‌తో రాజమౌళి కెరీర్‌కి కూడా స్టార్ట్ అయింది. కాకపోతే.. ఇదే ప్రభాస్ తర్వాతి దశలో రాజమౌళితో ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో నటించి మాస్ మాహారాజుగా మారిపోయాడు.


ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లు రాబట్టాయి. ముఖ్యంగా బాహుబలి సిరీస్ ప్రభాస్‌కి పాన్‌ ఇండియా స్టార్ స్టేటస్‌ను తీసుకొచ్చింది. అంటే.. మొదట స్టూడెంట్ నెంబర్ 1 మిస్ అయినా, తర్వాత ‘బాహుబలి’తో సక్సెస్‌ను డబుల్ చేసి దక్కించుకున్నాడు డార్లింగ్! ఇక ఇప్పుడు రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ఆ సినిమా తర్వాత జక్కన్న మళ్లీ ప్రభాస్‌తో మూవీ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. మొత్తానికి.. ఒకప్పుడు "నో" అన్న కథే, రాజమౌళికి "యెస్" అనిపించింది. అది కథ గొప్పదా? కాదా? అన్నది టైమింగ్ మీదే ఆధారపడి ఉంటుందనటానికి ఇదే బెస్ట్ ఉదాహరణ!

మరింత సమాచారం తెలుసుకోండి: