రష్మిక మందన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఈ బ్యూటీ పేరు మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . రష్మిక మందన్నా ఏ హీరోతో నటించిన నటించకపోయినా ఓ హీరో పేరు మాత్రం ఆమె పేరు పక్కన ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.  ఆ పేరు అందరికీ తెలిసిందే. ఆ పేరు మరేంటో కాదు "విజయ్ దేవరకొండ".  వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాలల్లో నటించారు . రెండో కూడా మంచి హిట్ టాక్ అందుకున్నాయి.  ముఖ్యంగా డియర్ కామ్రేడ్ హిట్ కాకపోయినా వీళ్ళ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి .

కాగా ఇప్పుడు మూడోసారి ముచ్చటగా వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . రష్మిక మందన్నా - విజయ్ దేవరకొండ కాంబో అందరికీ ఇష్టమే . గీత గోవిందం సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో అందరికీ తెలుసు . కాగా ప్రెసెంట్ విజయ్ దేవరకొండ "కింగ్డమ్" సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోగానే విజయ్ దేవరకొండ తన కెరియర్లో 14వ సినిమా షూటింగ్ సెట్స్ లో పాల్గొనబోతున్నారు.  ఈ మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉండగా హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్లో రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతుంది.  అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనాన్ని ఫిక్స్ చేసుకున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం అన్ని సెట్ అయిపోయినట్టే అంటున్నారు మూవీ మేకర్స్. "డియర్ కామ్రేడ్" తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు కలిసి నటించబోతున్న సినిమా ఇదే . ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . కింగ్డమ్ సినిమా తో గురువారం ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు విజయ్.  ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు . ఇక రష్మిక చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది..!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: