ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ కచ్చితంగా ఉంటుంది . అందులో డౌట్ లేదు . ఎక్కడ ఒక హీరోని పొగుడుతారో అక్కడ తిట్టే జనాలు కూడా ఉంటారు. అందులో అస్సలు డౌట్ లేదు . ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండపై ఎలాంటి ట్రోలింగ్ జరిగింది అన్నది అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా "లైగర్"  సినిమా మూమెంట్ లో మాత్రం విజయ్ దేవరకొండను ఏకీపారేశారు జనాలు . కొందరు మీడియా రిపోర్టర్స్ కూడా విజయ్ దేవరకొండపై ఘాటుగా ఫైర్ అయ్యారు . సినిమా ప్రమోట్ చేసుకోకుండా హెడ్ వెయిట్ చూపిస్తున్నాడు అని పిచ్చిపిచ్చి గా చేస్తున్నాడు అని ఓపెన్ గానే మండిపడ్డారు.


 విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఆయన తిక్క కుదిరింది అంటూ చాలామంది ట్రోల్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ ఆ తర్వాత నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా విషయంలో కూడా అదే విధంగా కామెంట్స్ వినిపించాయి. విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్ కన్నా కూడా తన వ్యక్తిగత ప్రమోషన్స్ ఎక్కువగా చేసుకుంటూ హెడ్ వెయిట్ చూపిస్తున్నాడు అంటూ చాలా బోల్డ్ గా కామెంట్స్ చేశారు కొంతమంది స్టార్స్ . ఇప్పుడు మాత్రం అది మొత్తం పాజిటివిటీగా మారిపోయింది. దానికి కారణం "కింగ్డమ్" సినిమా . విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా తాజాగా నటించిన సినిమా "కింగ్డమ్".



సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ కు హై మార్కులే పడ్డాయి.  అయితే కింగ్డమ్ సినిమా హిట్ అవడానికి కారణం  విజయ్ దేవరకొండ హై ఓవరాక్షన్ పర్ఫామెన్స్ ఇవ్వలేదు ఆ కారణంగానే అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే ఓవర్గా బిహేవ్ చేసే విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రమోషన్స్ లో మాత్రం చాలా క్లీన్ గా నీట్ గా వర్క్ చేశారు అని .. ఆ కారణంగానే కింగ్డమ్ సినిమాకి ఎటువంటి నెగిటివిటీ లేకుండా పాజిటివ్  టాక్ దక్కించుకుంది అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో విజయ్ దేవరకొండ పరువు పోయినట్లయింది.  ఒక పక్క సినిమా హిట్ అయింది అన్న ఆనందపడాలో లేకపోతే ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అని బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాడు విజయ్ దేవరకొండ.  కానీ ఒక్కటి మాత్రం నిజం "కింగ్డమ్" సినిమా హిట్ అవ్వడానికి కర్త - కర్మ - క్రియ అంతా కూడా విజయ్ దేవరకొండ అని చెప్పుకోవడంలో సందేహం లేదు అంటున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: