
`తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి విస్తరిస్తోంది. నాకు తెలిసిన ఓ అమ్మాయి ఆ ఉచ్చులో పడి ప్రస్తుతం రిహాబ్ సెంటర్లో అడ్మిట్ అయింది. సోషల్ మీడియాలో సాధువుల కనిపించే విజయ్ సేతుపతి కారవాన్ ఫేవర్స్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడు. ఆమెని కొన్నేళ్లుగా వాడుకున్నాడు. వీళ్లను చాలామంది జనాలు సాధువులుగా భావించి పూజలు చేస్తుంటారు. డ్రగ్స్ ఇచ్చి సెక్స్ చేయడం నిజం. ఇది జోక్ కాదు` అంటూ సదరు మహిళ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే `సార్ మేడమ్` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి... తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఓపెన్ అయ్యారు. ``నన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. వాళ్లకే కాదు నేనేంటో నాకు కూడా తెలుసు. ఏడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను చూశాను. దీనికీ భయపడలేదు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో కలత చెందారు. ` వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్ కావడం కోసమే ఇలా చేస్తుంది. ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సహజం. ఈ విధరమైన ఆరోపణలతో ఆమె పేరు కొన్ని నిమిషాలు హైలెట్ అవుతుంది. మా ఎంజాయ్మెంట్ కోసమే ఇదంతా. పాపం ఎంజాయ్ చేయనివ్వండి అని వారితో చెప్పాను` అలాగే ఆమెపై తన టీమ్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేసింది.` అని విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు.