చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే తెలుగు సినీ పరిశ్రమలో పార్ట్ 2 ల ట్రెండ్ అనేది దాదాపు లేనేలేదు. ఎప్పుడైతే బాహుబలి మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై సూపర్ సాలిడ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాహుబలి 2 మూవీ కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో కొత్త కొత్త రికార్డులను నమోదు చేసింది. దానితో దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఫిలిం మేకర్స్ పార్ట్ 2 లను ప్లాన్ చేస్తూ వస్తున్నారు.

ఇక అవసరం ఉండి పార్ట్ 2 ప్లాన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ మొదటి భాగం వల్ల రెండవ భాగం కు హైప్ వస్తుంది అనే ఉద్దేశంతో రెండవ భాగంను ప్లాన్ చేయడం వల్ల మొదటి భాగం కూడా బాగుండడం లేదు అనే అభిప్రాయాలు కొంత మంది లో వ్యక్తం అవుతున్నాయి. ఉదాహరణకు కొంత మంది ఫిలిం మేకర్స్ తమ సినిమా చివరణ అవసరం ఉన్నా లేకపోయినా దీనికి పార్ట్ 2 ఉండబోతుంది అని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. కానీ సినిమా మాత్రం అస్సలు ప్రేక్షక ఆదరణ పొందకపోవడంతో ఆ మూవీలకు సంబంధించిన పార్ట్ 2 ల అనౌన్స్మెంట్లు మాత్రం అస్సలు రావడం లేదు. దానితో జనాలు కూడా సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధిస్తే ఆ మూవీలకు పార్ట్ 2 లు తీస్తారు. లేదంటే దానిని వదిలేస్తారు.

కానీ ముందుగా మాత్రం పార్ట్ 2 అని వేశారు అంటే ఒక వేళ సినిమాకు మంచి టాక్ వచ్చి సినిమా మంచి విజయం సాధిస్తే  ఆటోమేటిక్గా మంచి క్రేజ్ వస్తుంది. దానితో పార్ట్ 2 ను రూపొందించవచ్చు అనే ఉద్దేశంతో మేకర్స్ ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అనే ఉద్దేశం కు కూడా చాలా మంది జనాలు వచ్చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో విడుదల అయిన కొన్ని సినిమాలకు పార్ట్ 2 ఉండబోతున్నట్లు సినిమా చివరన ప్రకటించారు. కానీ ఆ మూవీలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆ మూవీలో పార్ట్ 2 లకు సంబంధించిన అనౌన్స్మెంట్లు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: