టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కెరియర్ను ప్రారంభించిన తర్వాత వరుస పెట్టి అద్భుతమైన విజయాలను అందుకుంటు చాలా తక్కువ కాలం లోనే సూపర్ సాలిడ్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు. ఇక పవన్ "జానీ" సినిమా దగ్గర నుండి మాత్రం వరస పెట్టి భారీ అపజయాలను  ఎదుర్కొన్నాడు. అనేక ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పవన్ అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ lను కొనసాగిస్తున్న సమయంలోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.

దానితో ఆయన ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత కాలం క్రితం అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు కొంత కాలం ముందు పవన్ ఏకంగా హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాది భగత్ సింగ్ అనే మూడు మూవీలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలకు సంబంధించిన కొంత భాగం షూటింగ్లను కూడా పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత రాజకీయ పనులు భారీగా పెరగడంతో పవన్ ఈ మూడు సినిమాల పనులను పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాలపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

రాజకీయాల్లో అద్భుతమైన సక్సెస్ను సాధించిన తర్వాత కొంత కాలం పాటు పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించి ప్రస్తుతం మాత్రం కొంత సమయాన్ని సినిమాలకు కేటాయిస్తున్నాడు. దానితో ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ అయ్యి విడుదల అయింది. ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మూవీ విడుదల కూడా రెడీగా ఉంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పవన్ ఉన్నాడు. ఇలా పవన్ చాలా మంది హీరోలతో పోలిస్తే ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు , ఓ వైపు సినిమాలతో అత్యంత బిజీగా కెరీర్ను ముందుకు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk