నేషనల్ అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు . ఒక నటుడికి ఒక నటికి మంచి గుర్తింపు అది. ఎన్నో ఏళ్ళు కష్టపడి , శ్రమించి ఒక ప్రాజెక్టు కోసం లైఫ్ ని త్యాగం  చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన నటనా పర్ఫామెన్స్ లో నేషనల్ అవార్డు వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి గర్వకారణంగా ఉంటుంది . ఇటీవల 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు . సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు టెలివిజన్ ఇండస్ట్రీకి కూడా నేషనల్ అవార్డ్ ఇవ్వాలి అంటూ చాలామంది డిమాండ్ చేస్తూ ఉంటారు .


తాజాగా అలాంటి ఇష్యూ ని మరొకసారి తెరపైకి తీసుకువచ్చింది అనుపమ సీరియల్ ఫేమఋ రూపాలీ గంగోలి.  కేవలం సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి నేషనల్ అవార్డు ఇస్తే ఎలా..? టెలివిజన్ నటీనటులను కూడా గుర్తించాలి.. వాళ్ళు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి అంటూ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడింది అనుపమ సీరియల్ ఫేమ్. " కరోనా మహమ్మారి సమయంలో కూడా బుల్లితెర నటినటులు పనిచేశారు అని ..ఇంకా సినిమా షూటింగ్స్ ఆపేశారు అని సీరియల్ షూటింగ్స్ మాత్రం ఎక్కడా ఆపలేదు అని ..మూవీ స్టార్స్ కంటెంట్ క్రియేటర్స్ కు అవార్డ్స్ ఉన్నప్పుడు తమకు ఎందుకు ఉండకూడదు అంటూ సూటిగా ప్రశ్నించింది .



తమను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ ప్రభుత్వాన్ని కోరింది . అనుపమ సీరియల్ నటి రూపాలి గంగోలి మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి . అయితే నటి రూపాలి గంగోలీని ఆమె పేరుతో పిలవడం కన్నా సీరియల్ పేరుతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఆమె  గుర్తింపు సంపాదించుకుంది . విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కేలా చేసుకుంది. ఇప్పటికీ హిందీ టీవీలో ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటుంది . తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ  అవార్డ్స్ గెలుచుకున్నారు . అనుపమ సీరియల్ నటి రూపాలి గంగోలి మాట్లాడిన మాటలు ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవితున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: