
నిన్నటి రోజున చిరంజీవి మాట్లాడుతూ తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉన్నప్పటికీ అయినా కూడా కొంతమంది నేతలు తనని విమర్శిస్తున్నారు అంటు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.. అంతేకాకుండా ఆ మధ్య ఒక నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారని.. అయితే ఆయన ఒక ప్రాంతానికి వెళితే ఒక మహిళ అడ్డుకొని మరి ఎదురు తిరిగిందనే అంశాన్ని చిరంజీవి ప్రస్తావించడం జరిగింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు నారాయణ స్పందించారు.
తమకు వేతనాలు పెంచాలి అంటు సినీ ఇండస్ట్రీలో ఉండే కార్మికుల సైతం సమ్మె చేస్తుండడం పై నారాయణ స్పందించారు.. సినీ ఇండస్ట్రీ కేవలం నలుగురు చేతులలో మాత్రమే ఉన్నదని వారే మొత్తం ఆడిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు, హీరోలను పిలిచి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి సినీ కార్మికులను మాత్రం ఎందుకు పిలిచి మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు.. కార్మికులను ఎవరు విమర్శించినా కూడా కమ్యూనిస్టు పార్టీ అసలు ఊరుకోదంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి పక్షపాతం సరి కాదని కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలంటు హెచ్చరించారు. గతంలో బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్లను సంఘవిద్రోహశక్తులుగా చూసేవారు.. కానీ ఇప్పుడు ప్రభుత్వమే రేట్లు పెంచి మరి బ్లాక్ టికెట్లను అమ్మేలా చేస్తోంది అంటూ ఆరోపణలు చేశారు.