
టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డ్యాన్సర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది జూనియర్ ఎన్టీఆర్ పేరును సమాధానం చెబుతారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వార్2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇండియాలో గొప్ప డ్యాన్సర్ ఎవరంటే హృతిక్ రోషన్ అని అన్నారు. హృతిక్ రోషన్ తో కలిసి సినిమాలో డ్యాన్స్ చేయడం నా అదృష్టం అని తారక్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నోటి వెంట ఫ్యాన్ బాయ్ గా ఇలాంటి కామెంట్లు వినడం ఫ్యాన్స్ కు ఒక విధంగా సంతోషాన్ని కలిగించినా అభిమానులు మాత్రం తాము ఈ విషయాలను అస్సలు అంగీకరించబోమని చెప్పుకొచ్చారు. అయితే తారక్ మాత్రం మీ దారి మీది నా దారి నాది అంటూ అభిమానులను కన్విన్స్ చేయడానికి తన వంతు ప్రయాణించారు. మనకంటే గొప్ప డ్యాన్సర్లు ఉన్నారని తారక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వార్2 సినిమాకు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబో సాంగ్ కూడా హైలెట్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు రికార్డ్ స్థాయిలో వ్యూస్ సైతం వచ్చాయనే సంగతి తెలిసిందే. వార్2 సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మరో మూడు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. వార్2 సినిమా హిందీ కలెక్షన్లతో పోల్చి చూస్తే తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశం అయితే ఉంది. వార్2 రికార్డుల పరంపర మొదలైతే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. వార్2 బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో చూడాలి. తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.