టాలీవుడ్ లో హీరోయిన్ ప్రియమణి హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. ఈమధ్య ఎక్కువగా వెబ్ సిరీస్, పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జననాయగన్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్ వినోద్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా చిత్ర బంధం ప్లాన్ చేశారు. ఇందులో నటిస్తున్న ప్రియమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్ ఇండస్ట్రీ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.


ముఖ్యంగా బాలీవుడ్ లో కొంతమంది దర్శకులు తనని చూసి సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకుంటున్నామంటూ తెలియజేశారట. అప్పుడు తనకు ఈ విషయంపై చాలా బాధ కలిగిందని తెలియజేసింది ప్రియమణి.. ఆ సమయంలో వారికి కౌంటర్ వేస్తే మేము నిజంగా దక్షిణాది వాళ్ళమే అయినప్పటికీ అన్ని భాషలు కూడా మాట్లాడగలమని ఏ పాత్రలోనైనా నటించగలమని తెలిపింది.. ఉత్తరాది నటిమణుల మాదిరిగా తెల్లగా ఉండలేకపోవచ్చు కానీ అందంగా ఉంటామని ఏ విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పగలుగుతామని తెలిపింది.


కేవలం చర్మానికి ఉండే రంగు ముఖ్యం కాదు ప్రతిభ ప్రాధాన్యతను కలిగిస్తుందని తెలిపింది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటికీ కూడా బాలీవుడ్ లో రంగు, ప్రాంతాన్ని చూసి అవకాశాలు ఇస్తున్నారనే విషయం తెలిసి బాధపడ్డాను తెలియజేసింది. ప్రతిభకు కలర్ కు సంబంధం లేకుండా గుర్తించి పాత్రలు ఇస్తే బాగుంటుందంటూ ప్రియమణి తెలియజేసింది.ప్రస్తుతం ప్రియమణి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో తరచు ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అన్ని భాషలలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రియమణి చేసిన ఈ వ్యాఖ్యలకు ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: