
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పైన కాల్పులు చేయడంతో ఈ విషయం పైన ప్రశ్నించారు. తాజాగా ఈయన యూనివర్సిటి పేపర్ లీక్ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ వీక్షించి అనంతరం మూర్తి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నారాయణమూర్తి వన్ మ్యాన్ ఆర్మీ ఆయన సినిమాలలో ఆయనే రాజు, మంత్రి ,సైన్యాధిపతి అంటూ తెలియజేశారు. కథను సినిమా ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లేందుకు ఆయన చేసే ప్రయత్నం ఎప్పుడు అబ్బురపరిచేలా ఉంటుందని తెలిపారు. ప్రతి చిత్రంలో కూడా ఏదో ఒక సామాజిక ప్రయోజనం ఉండేలా సినిమాలు తీయడం ఆయనకే సాధ్యం అంటూ తెలిపారు.
అయితే ఈయన చేసే పనులు కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇలాంటివారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని లేకపోతే ప్రపంచమంతా కూడా ఏకపక్షం ధోరణిగా ఉంటుందంటూ తెలిపారు.. ఎక్కడ రాజీ పడకుండా బ్రతకడం అందరికీ సాధ్యం కాదు.. తాను కూడా ఎన్నోసార్లు రాజీ పడ్డానని తెలిపారు.. కానీ మూర్తి గారి గురించి మరొక మాట తాను విన్నానని ఒక సినిమాలో ఒక పాత్ర కోసం ఆయనని అనుకున్నాను.. కానీ ఆయన్ని పారితోషకంతో ఎవరు కొనలేరని విషయం అనడంతో ఆ ఆలోచన నుంచి విరమించుకున్నానని తెలిపారు.. గతంలో కూడా టెంపర్ సినిమాలో పోసాని కృష్ణ మురళి పాత్ర పోషించిన కానిస్టేబుల్ పాత్రకు మొదట డైరెక్టర్ పూరి జగన్నాథ్ నారాయణమూర్తికి ఆఫర్ ఇచ్చారట. కానీ ఆ విషయాన్ని ఆయన తిరస్కరించారట. ఎక్కువ పారితోషకం ఇస్తానన్నా కూడా నో చెప్పారట నారాయణమూర్తి.