కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి బిగ్ స్టార్స్ కలిసి నటించిన మాస్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ “కూలీ” ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా  భారీ హైప్ సృష్టించింది. యాక్షన్ స్పెషలిస్ట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన స్టైల్‌లో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా మీద అంచనాలను ఆకాశానికెత్తేశాయి.
యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా సునామీలా దూసుకుపోతోంది. రిలీజ్‌కి ఇంకా ఒక రోజే మిగిలి ఉండగానే, “కూలీ” ప్రీ సేల్స్‌లోనే సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. తమిళ్ సినిమా చరిత్రలోనే మొదటిసారి ప్రీ సేల్స్ దశలోనే 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ రికార్డు చూశాక ప్రేక్షకులు ఈ సినిమాపై చూపుతున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.


ర‌జ‌నీ క్రేజ్‌తో పాటు లోకేష్ కనగరాజ్ పై ఉన్న న‌మ్మ‌కం కూడా సినిమా దుమ్ము దులిపేలా చేస్తోంది. ర‌జ‌నీతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి బహుభాషా సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత స్పెషల్ టచ్ ఇస్తోంది. మ్యూజిక్‌లో అనిరుద్ రవిచందర్ మరోసారి తన మార్క్ చూపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా మాస్ బీట్‌తో కూడిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగా వైర‌ల్ అవుతున్నాయి.


మొత్తానికి, రిలీజ్‌కి ముందే “కూలీ” సృష్టించిన రికార్డులు చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ తెచ్చేలా ఉంది. రజినీ, లోకేష్ కాంబో మంత్రం ఎలా ఉందో చూడటానికి అభిమానులందరూ ఆగస్టు 14 కోసం వెయిట్ చూస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: